Header Banner

ఆటో కొనాలి అనుకుంటున్నారా... ఈ శుభవార్త మీకోసమే! విజయవాడ, విశాఖలో ఆటో పరిమితి ఎత్తేసిన కూటమి ప్రభుత్వం!

  Fri Feb 21, 2025 21:02        Politics

విజయవాడ, విశాఖలో ఆటోలు నడుపుకోవాలని అనుకొనే వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2 నగరాల్లోనూ కొత్త ఆటోలు తిప్పేందుకు అనుమతించింది. ఆదేశాలు వెంటనే అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. మారుతున్న పరిస్థితులు, ప్రయాణికుల అవసరాలు, కాలుష్యం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో జనాభాను బట్టి అక్కడ ఎన్ని ఆటోలు తిరిగేందుకు అనుమతి ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఆటోల పర్మిట్ల విషయంలోనూ ఆంక్షలు ఉంటాయి.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!


రవాణాశాఖ నిర్ణయించిన సంఖ్యకు మించి ఆటోలు రోడ్లపై తిరగకూడదు. విజయవాడలో ప్రస్తుతం 13,330 ఆటోలు తిరుగుతున్నాయి. విశాఖలో 8400 ఆటోలకు మాత్రమే పర్మిట్లు జారీ చేశారు. ఏటికేడు పెరుగుతున్న ప్రయాణికుల ఆధారంగా ఆటోల సంఖ్య పెంచాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆటోలు సరిపోక, అధిక ఛార్జీలతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆటోల సంఖ్యపై పరిమితి ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో కొత్త పర్మిట్ల జారీకి రవాణాశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ధరల పెంపు, నష్ట భయాలతో ఇప్పుడు డీజిల్ ఆటోల్ని నడిపేందుకు డ్రైవర్లు ఇష్టపడటం లేదు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


చాలామంది BS 6, CNG, LPG, బ్యాటరీ ఆటోలను కొనుగోలు చేసి తిప్పుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కాలుష్య కారకాలు కానివాటినే ప్రోత్సహిస్తోంది. విజయవాడ, విశాఖ నగరాల్లోనూ BS-6 ప్రమాణాలతో తయారైన CNG, LPG, బ్యాటరీ ఆపరేటెడ్ ఆటోలు పర్యావరణహితమైనవి కావడంతో వాటికే అనుమతిస్తున్నారు. కొత్తగా ఎన్ని ఆటోలకైనా పర్మిట్లు లభించబోతున్నాయి. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఆటోలు ఉన్నందున ఆటోవాలాలు అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. మీటర్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. కొత్త ఆటోల రాకతో దందాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #auto #goodnews #drivers #todaynews #flashnews #latestupdate